కిరణ్ పై బాలరాజు విమర్శల బాణం !

cm-kiran-minister-balarajuరాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం ఆజ్ఞను సైతం ధిక్కరించి సమైక్య ఛాంపియన్ గా పేరుతెచ్చుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇంటిపోరు తప్పడం లేదు. కిరణ్ వ్యతిరేఖ వర్గం ఆయనపై విమర్శనాస్త్రాలను సంధిస్తూనే వుంది. ఈ జాబితాలో మరో గిరిజన సంక్షేమ శాఖా మంత్రి బాలరాజు చేరిపోయారు. ముఖ్యమంత్రి పాల్గొన కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా బాలరాజు విముఖుత చూపించిక పోవడం విశేషం. తాజాగా, కిరణ్ పై మరో సారి బాలారాజు తన విమర్శల బాణాన్నిఎక్కుపెట్టారు. తాను గిరిజనుడిని కాబట్టే తనపై సీఎం వివక్ష చూపిస్తున్నారంటూ విమర్శించారు. తన ఆలోచన అయిన ఎస్సీ- ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని ముఖ్యమత్రి తన గొప్పతనంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు మండిపడ్డారు. ముఖ్యమంత్రి గిరిజన శాఖను పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. ఇప్పటికే విభజన విషయంలో.. తెలంగాణ నేతలకు దూరమైన ముఖ్యమంత్రికి.. ఇలా రోజుకో మంత్రి విమర్శల బాణాలను సంధించడం ఇబ్బంది పెట్టే విషయమే మరీ..!