ఒవైసీ మాట్లాడుతూ.. మోడీ తీసుకున్న ట్రిపుల్ తలాక్ కారణంగా ముస్లీంలు అంతా కూడా ఒక్క తాటిపైకి వచ్చారు అని, ఇప్పటి వరకు చెల్లా చెదురుగా ఉన్న ముస్లీంలు ఏకం కావడంలో మోడీ తీసుకున్న నిర్ణయం బాగా పని చేసిందని చెప్పుకొచ్చాడు. ఇటీవలే హజ్ యాత్రకు రాయితీని తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఒవైసీ సమర్ధించాడు. ఆ వెంటనే రెండవ సారి మోడీ వల్ల ముస్లీంలకు మంచి జరుగుతుందని ఒవైసీ చెప్పడం అందరికి ఆశ్చర్యంగా ఉంది.
మోడీకి ముస్లీంలపై అభిమానం ఉంటే, ముస్లీం మహిళలు అంటే అభిమానం బడ్జెట్‌లో వారి కోసం నిధులు కేటాయించాలి అంటూ ఒవైసీ డిమాండ్ చేశాడు. ట్రిపుల్ తలాక్‌తో ముస్లీంలకు న్యాయం చేయాలని భావిస్తున్న కేంద్రం మరింత అన్యాయం చేస్తుందని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.