అర్థరాత్రి హైడ్రామా..!

tdp-leaders-agitation-on-poవిద్యుత్ సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసన చివరకు హైడ్రామా మధ్య ముగిసింది. విద్యుత్ సమస్యలపై స్వీకర్ చర్చకు నిరాకరించడంతో.. నిన్న (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోనే ఆందోళన చేపట్టారు. విద్యుత్ సమస్యలపై చర్చకు అనుమతించే వరకు.. అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లేది లేదంటూ సుమారు 56 మంది ఎమ్మెల్యేలు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పోలీసులు ముందు జాగ్రత్తగా అసెంబ్లీ ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల సమయంలో అసెంబ్లీలో విద్యుత్ సరఫరా నిలిపివేసిన పోలీసులు ఆ తర్వాత కొద్దిసేపటికే టీడీపీ నేతలను బలవంతంగా రెండు వాహనాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలించారు. పోలీసుల ప్రవర్థనపట్ల ఆగ్రహించిన టీడీపీ నేతలు అక్కడే కొద్దిసేపు ధర్నాకు దిగారు. ఎన్టీఆర్ భవన్ గార్డెన్ లోనే రాత్రి బసచేశారు. విద్యుత్ సమస్యపై చర్చకు అనుమతించేవరకు ఆందోళన కొనసాగిస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.