మెల్‌బోర్న్‌ లో లొక్డౌన్ ఎత్తేసిన ప్రభుత్వం, ప్రపంచంలోనే అత్యధిక రోజులు లాక్‌డౌన్‌లో ఉన్న నగరంగా మెల్‌బోర్న్‌

సుదీర్ఘ కాలంపాటు లాన్‌డౌన్‌లో ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలోనూ ప్రభుత్వం తాజాగా నిబంధనలను ఎత్తివేసింది. కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిస్థాయిలో తొలగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. దీంతో 9 నెలల (దాదాపు 262 రోజులు) సుదీర్ఘ లాక్‌డౌన్‌కు తెరపడింది. 50 లక్షల జనాభా కలిగిన మోల్‌బోర్న్‌లో గతేడాది మార్చి నుంచి ప్రభుత్వం ఆరుసార్లు లాక్‌డౌన్‌ విధించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక రోజులు లాక్‌డౌన్‌లో ఉన్న నగరంగా మెల్‌బోర్న్‌ నిలిచింది.