సీఎం అభ్యర్థిగా.. మెగాస్టార్ !

chiruరాష్ర్టంలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతకొద్ది రోజులుగా వచ్చే ఎన్నికల్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ప్రజల్లోకి వెళితే అంతే సంగతులని అత్యధిక కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. సీఎం ఒంటెద్దుపోకడలతో వ్యవహరిస్తున్నారని ఇప్పటికే పలువురు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. దీనికి తోడు.. వచ్చే ఎన్నికల్లో చిరంజీవే ముఖ్యమంత్రి అభ్యర్థి అని సి. రామచంద్రయ్య అనధికార ప్రచారం ప్రారంభించారు. సీఎం వ్యతిరేకవర్గంగా భావిస్తున్న బొత్స, రఘువీరా.. తదితరులు మంగళవారం మెగాస్టార్ ఇంట్లో సమావేశమయి సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు (బుధవారం) చిరు గన్ గా భావించే రామచంద్రయ్య ఓ అడుగుముందుకేసి… చిరంజీవి ఛరిష్మా గల నాయకుడని, వచ్చే ఎన్నికల్లో చిరంజీవి నాయకత్వం వహిస్తే.. తప్పేంటని ప్రశ్నించారు. మంత్రిగారి ప్రపొజల్ కి రఘువీరా కూడా మద్ధతు ప్రకటించినట్లు సమాచారం. సీఎం అసమ్మతి నేతలంతా ’జై చిరంజీవ’ అంటూ.. చిరు పంచనే చేరే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు.