తెలంగాణలో మే 7 వరకు లాక్ డౌన్

కరోనా మహమ్మారి నివారణకు తాము గతంలోనే ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించామని, కేంద్రం మే 3 వరకు ప్రకటించిన లాక్ డౌన్ ఉండనే ఉందని , అయితే మే 7 వరకు లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించామని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్

ఇప్పటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని కొన్ని మీడియా చానళ్ల చర్చల్లోనూ 92 శాతం లాక్ డౌన్ పొడిగింపు అభిప్రాయాలు వచ్చాయని తెలిపారు. తాను వ్యక్తిగతంగానూ క్రాస్ చెక్ చేశానని, నియోజకవర్గాల వారీగా రైతులను, కూలీలను, ఉద్యోగులను, ఇతర రంగాల వారితో 70 మందితో మాట్లాడానని, వారందరూ ఒక్కటే ప్రశ్న అడిగారని తెలిపారు.

మే 1 వరకు కొత్త కేసుల సంఖ్య తగ్గే పరిస్థితి లేదని.. గతంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ నిబంధనలు అలాగే కొనసాగుతాయని కేసీఆర్‌ చెప్పారు. పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.