ముందునుండి అనుకున్నట్లే కేసీఆర్ మరోసారి లాక్ డౌన్ ను పొడిగించారు. మే 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈసారి లాక్ డౌన్ లో తెలంగాణ ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. అందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎరువులు వ్యవసాయ పనిముట్ల దుకాణాలు తెరిచి ఉంటాయి అని తెలిపింది.
అయితే రాత్రి 7 గంటల తర్వాత బయటకు వస్తే పోలీసు చర్యలు తప్పవు అని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో 100% దుకాణాలు తెరుచుకోవచ్చు అని ప్రకటించింది. కానీ పురపాలక ప్రాంతాల్లో తెరిచేందుకు 50 శాతం దుకాణాలకు మాత్రమే అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం జోన్ల వారిగా పలు సడలింపులు ఇచ్చింది. వాటిని అతిక్రమించడానికి మనకు అధికారాలు లేవు. అంతకన్న కఠినంగా నిబంధనలు పెట్టుకోవచ్చు. కానీ వాటిని వాళ్లు ఇచ్చిన నిబంధనలను కచ్చితంగా ఫాలో కావాల్సిందే. కేంద్రం జాబితాలో ఉన్నవాటిలో 5, 6 జిల్లాలు ఈ రోజుకే గ్రీన్ జోన్‌లోకి వెళ్తున్నాయి. మంత్రి ఈటల కేంద్ర ఆరోగ్యశాఖమంత్రికి లేఖ రాసి గ్రీన్ జోన్‌లోకి మార్పించాల్సి ఉంటుంది. వచ్చే 11 రోజుల్లో ఇప్పుడు ఆరెంజ్ జోన్లో ఉన్న 18 జిల్లాలు కూడా గ్రీన్‌జోన్‌లోకి వస్తాయి. రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు 35 ఉన్నాయి. హైదరాబాద్‌లో 19, ఇతర రెడ్‌జోన్ జిల్లాల్లో 16 ఉన్నాయి. ఈ రోజుతో 23 కంటైన్మెంట్‌ల సమయం పూర్తవుతుంది. వీటిని కూడా డినోటిఫై చేస్తారు. 12 కంటైన్మెంట్ జోన్లు మాత్రమే ఉంటాయి.
ఇక ఏ ఏ జోన్లలో ఏ ఏ జిల్లాలు ఉన్నాయంటే
ఆరెంజ్ జోన్ జిల్లాలు:
సంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిజామబాద్, కామారెడ్డి, నల్గొండ, ఖమ్మం, జనగామ, నారాయణపేట్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, గద్వాల
రెడ్‌జోన్ జిల్లాలు:
సూర్యాపేట, వరంగల్ అర్బ న్, వికారాబాద్,రంగారెడ్డి, మేడ్చల్,హైదరాబాద్
గ్రీన్ జోన్ జిల్లాలు:
యాదాద్రి భువనగిరి, వనపర్తి, వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, ములుగు, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి