దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 17 వరకు కేంద్రం పొడిగించగా..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కరోనా పూర్తిగా పోవాలంటే మరికొన్ని రోజులు లాక్ డౌన్ పొడిగించకతప్పదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అందుకున్న సమాచారం మేరకు కనీసం ఈ నెల 28 వరకైనా లాక్ డౌన్ పొడగించే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ లో వేటికి మినిహాయింపులు ఇస్తుంది.. వేటికి ఇవ్వదు అనేవాటిపై రాష్ట్రం తీసుకునే నిర్ణయాలపై సీఎం కెసీఆర్ అధికారులతో ఇప్పటికే చర్చించారు. దీనిపై సాయంత్రం స్పష్టత రానుంది.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని జిల్లాలను కరోనా కేసులు, వ్యాప్తి సంబంధిత అంశాలని దృష్టిలో పెట్టుకొని మూడు జోన్ లుగా విభజించింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ లుగా విభజించిన, జోన్ ల వారిగా లాక్ డౌన్ సడలింపులు ఇచ్చింది. గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో వెసులుబాట్లు ఇచ్చిన కేంద్రం రెడ్ జోన్ లు ఆంక్షలు ఎక్కువగా పెట్టింది. అయితే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ టూ ని మే 3 వరకు అమలు చేస్తే, తెలంగాణ మాత్రం మే 7 వరకు కొనసాగిస్తోంది. దీంతో లాక్ డౌన్ త్రీలో భాగంగా తెలంగాణ ఎలాంటి అనుమతులిస్తోందనే ఆసక్తి అందరిలో నెలకొంది.