Site icon TeluguMirchi.com

తెలంగాణలో మద్యం షాపులు ఓపెన్ .. కండీషన్స్ అప్లయ్.

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం తో పిచ్చోళ్ళు అయ్యారు. ఇక సోమవారం నుండి అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభం మొదలు కావడం తో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపులు ఓపెన్ చేస్తారో లేదో అని మందు బాబులు ఖంగారు పడుతున్న వేళా కేసీఆర్ మద్యం ప్రియులకు తీపి కబురు తెలిపారు.

రాష్ట్రంలో బుధవారం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. పక్కరాష్ట్రాల్లో దుకాణాలు తెరవడం కారణంగా అక్కడి నుంచి రాష్ట్రంలోకి స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే తెలంగాణలో కూడా మద్యం విక్రయాలకు అనుమతిస్తున్నట్టు తెలిపారు. రెడ్ జోన్ జిల్లాలో కూడా వైన్ షాపులకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు కేసిఆర్.

కంటెన్మెంట్ జోన్స్‌లోని మద్యం షాపులు మూసి ఉంటాయని కేసీఆర్ చెప్పారు. బార్లు, క్లబ్బులు, పబ్బులకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు। మద్యం ధరలు 16 శాతం పెంచుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. చీప్ లిక్కర్‌పై 11 శాతం రేటు పెంచుతున్నట్లు చెప్పారు. మళ్లీ తగ్గించే అవకాశం కూడా లేదని అన్నారు.

ఉదయం 10 గంటల నుంచి వైన్స్ షాపులు ఓపెన్ అవుతాయని, అక్కడ బౌతిక దూరం పాటించాల్సిదేనని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే వైన్ షాపులను సీజ్ చేస్తామని చెప్పారు. భౌతిక దూరాన్ని పాటించకపోతే వెంటనే సడలింపులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

Exit mobile version