సిక్కిం లోని నాథూ లాపర్వత లోయ ప్రాంతంలో భారీ హిమపాతంసంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు పర్యాటకులు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో పర్యాటకులు మంచు కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సిక్కిం రాజధాని గాంగ్‌టక్ ను.. చైనా సరిహద్దు సమీపంలోని నాథులా పాస్‌ను కలిపే జవహార్‌లాల్ నెహ్రూ మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సరిహద్దు రహదారుల సంస్థ , సిక్కిం పోలీసులు, స్థానిక అధికారుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొసాగుతున్నాయి. హిమపాతంలో చిక్కుకున్న 27 మందిని సురక్షితంగా కాపాడారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంగ్‌టక్‌కు తరలించినట్లు చెప్పారు. మంచు కారణంగా రోడ్డుపై వాహనాల్లో చిక్కుకుపోయిన 350 మంది పర్యాటకులనూ కాపాడినట్లుఅధికారులు తెలిపారు.