తెలుగుదేశం పార్టీ కి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల ముందు ఎలాగైతే పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారో..ఇప్పుడు కూడా అదే పద్దతిలో ఉన్న కొంతమంది వెళ్తున్నారు. వీరిలో కొంతమంది పార్టీ అధిష్టానం మీద నమ్మకం లేక, అధిష్టాన వైఖరి నచ్చని వారు కొంత ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడటానికి సిద్ధమవుతున్నారు.
తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడడానికి సిద్దమైనట్లు సమాచారం…పర్చూరు నియోజక వర్గ ఎమ్మెల్యే సాంబశివరావు ,రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ టీడీపీని వదిలి,అధికార వైసీపీ పార్టీ లో చేరడానికి సిద్ధమయ్యారని సమాచారం.