Site icon TeluguMirchi.com

విభజిస్తే.. మావోయిస్ట్ లు మాటేస్తారా..?

cm kiranగతవారం తెలంగాణ అంశంపై కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో నేతలు వివరించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోనికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యనేతలు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోధర రాజనర్సింహా, పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణ ఈ ముగ్గురు త్రిమూర్తులు రాష్ట్రానికి సంబంధించిన తమ తమ రోడ్ మ్యాప్ లను అధిష్టాన పెద్దల ముందు ప్రజేంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ ముగ్గురిలో సీఎం కిరణ్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రాస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రాన్ని విభజిస్తే.. నక్సలిజం పుంజుకుంటుందని సవివరంగా వివరించినట్లు సమాచారం.

దేశం ఎదుర్కొంటున్న ముఖ్యసమస్యల్లో నక్సలిజం ఒకటని.. దీని గురించి ఇప్పటికే ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా చాలా సందర్భాల్లో ప్రాస్తావించారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే.. రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి మాటేస్తారని, సరిహద్దులో ఇరు సైన్యాల మధ్య చోటుచేసుకునే కాల్పుల వంటి ఘటనలు.. ఇప్పటికే ఖమ్మం, విశాఖ వంటి ఏజేన్సి ప్రాంతాల్లో వారానికోసారి చోటుచేసుకుంటున్నాయని ఆయన వివరించారు.

ఒకప్ప్పుడు నక్సలిజానికి కంచుకోటలాంటి ఆంధ్రపదేశ్ లో వారిని నియత్రించడానికి రాష్ట్రం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చిందని, దీనికోసం దాదాపు 25 సంవత్సరాలు పట్టిందని అన్నారు. ఇప్పుడు దేశంలో ఉన్న మావోయిస్ట్ కమిటీలకు సారధ్యం వహిస్తున్న వారిలో ఎక్కువ మంది ఆంద్రప్రదేశ్ కు చెందినవారేనని, అందులో లంగాణకు చెందినవారే అధికమని.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే.. మరోసారి వారు తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు తెలుస్తోంది.  గతంలో మావోయిస్ట్ ఘటనలకు బలైన మంత్రి మాధవరెడ్ది, మాజీ స్పీకర్ శ్రీపాదరావు… తదితర ఘటనలు ఉదాహరణలు కిరణ్ పేర్కొనట్లు తెలుస్తోంది. అందుకు గల ప్రభుత్వ గణంకాలను సీఎం కోర్ కమిటీ ముందుంచారు.

మొత్తానికి రాష్ట్రాన్ని విభజిస్తే.. దేశం ఎదుర్కొంటున్న ముఖ్యసమస్యల్లో ఒకటైన నక్సిలిజం తెలంగాణలో మరింతగా పాతుకుపోతుందనే చెప్పడంలో ముఖ్యమంత్రి సఫలీకృతమైనట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. తద్వారా తెలంగాణపై కేంద్రం నిర్ణయాన్ని జాప్యం చేయడంలో సీఎం విజయం సాధించారని సమాచారం.

Exit mobile version