Site icon TeluguMirchi.com

తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ


తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మావోల కదలికలు మొదలవుతున్న సమయంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. వీరిలో 300 మంది మిలీషియా సభ్యులు కూడా ఉండటం గమనార్హం.

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగ్‌పుట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పదల్‌పుట్,కుసుంపుట్,మటంపుట్, జోదిగుమ్మ గ్రామాల మిలీషియా సభ్యులతో పాటు, ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా భజగుడ,బైసెగుడ, ఖల్‌గుడ, పట్రపుట్, వందేపదర్, సంబల్‌పూర్, సింధిపుట్ గ్రామాలకు చెందిన మిలీషియా సభ్యులు లొంగిపోయారు. వీరందరూ కూడా కోరాపుట్ డీఐజీ రాజేశ్ పండిట్, బీఎస్ఎఫ్ డీఐజీ మదన్‌లాల్, మల్కన్‌గిరి ఎస్పీ నితేశ్ వద్వని, 65వ బెటాలియన్ సీఓ టీఎస్ రెడ్డి సమక్షంలో సరెండర్ అయ్యారు. ఏఓబీ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లుగా వారు తెలిపారు.

Exit mobile version