మంచు లక్ష్మిపై బీజేపీ ఆసక్తి.. చిత్తూరుకు ఓకే!!

Manchu-Lakshmi-industryమంచు ఫ్యామిలీ నుండి పరిచయమైన మంచు లక్ష్మి ప్రసన్న నటిగా, నిర్మాతగా, బుల్లి తెరపై హోస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. సామాజిక అంశాలపై ఎక్కువగా మాట్లాడే ఈమెకు రాజకీయాలు అంటే ముందు నుండే ఆసక్తి. ఆ ఆసక్తితోనే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటుంది. ఇక తాజాగా ఆమె రాజకీయ ఎంట్రీ కూడా దాదాపుగా ఖరారు అయ్యింది. తండ్రి ఎంపీగా చేసిన నేపథ్యంలో ఆయన వారసత్వంగా ఎంపీగా పోటీ చేసేందుకు మంచు లక్ష్మి కొన్నాళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకత్వం మంచు లక్ష్మిని తమ పార్టీ తరపున రంగంలోకి దించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు స్టార్స్‌ యొక్క సపోర్ట్‌ను బీజేపీ కోరుకుంటుంది. మంచు వారి ఫ్యామిలీ సపోర్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో కొంత అయినా ఫలితం, ప్రభావం ఉంటుందని బీజేపీ భావిస్తుంది. అందుకే మంచు లక్ష్మి కోరుకున్నట్లుగా ఆమెకు చిత్తూరు జిల్లా ఎంపీ సీటును కూడా బీజేపీ ఇప్పటికే ఖరారు చేసినట్లుగా మాట్లాడుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియడం లేదు. అంటే తెలుగు దేశం పార్టీతో బీజేపీకి పొత్తు ఉండవచ్చు, ఉండక పోవచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ బలోపేతం వైపు అడుగు వేస్తుంది. అందుకే 2019 ఎన్నికలకు ఇప్పటి నుండే సన్నద్దం అవుతుంది. అందులో భాగంగానే మంచు లక్ష్మితో బీజేపీ నాయకులు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.