మంచిర్యాలలో విషాదం : ఒకే ఇంట్లో ఇద్దరి వ్యాపారస్తులను మింగిసేన కరోనా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉదృతి ఏ రేంజ్ లో ఉందో ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. పదుల సంఖ్యలో కరోనా కు బలి అవుతున్నారు. తాజాగా మంచిర్యాలలో విషాదం చోటు చేసుకుంది. కేవలం 20 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ముగ్గురు మృతి చెందడం ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది.

చెన్నూరుకు చెందిన కినారపు భూమయ్య ( 72 ) జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో వ్యాపారం చేస్తూ స్థిరపడ్డారు. ఆయనకు నలుగురు కుమారులు ఉండగా.. 20 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చిన్న కుమారుడు మృతి చెందాడు. ఇక గత నెలలో భూమయ్యతో పాటు రెండో కుమారుడు కిరణ్ కుమార్(43)‌, చిన్నారులకు కరోనా సోకింది. తండ్రీకొడుకులను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చిన్నారులు హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకోగా.. భూమయ్య చికిత్స పొందుతూ గత నెల 22న చనిపోయారు. ఆ తరువాత మరో కుమారుడు కిషోర్ కుమార్‌(45)కరోనా సోకగా.. దీంతో అతడిని హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలో ఈ నెల 4న కిషోర్ కుమార్ మరణించారు. ఈ విషాదం నుంచి తేరుకునే లోపే కిరణ్ కుమార్ బుధవారం రాత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇలా 20 రోజుల వ్యవధిలో కుటుంబ పెద్దతో పాటు ఇద్దరు కుమారులు కరోనాకు బలవ్వడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది