Site icon TeluguMirchi.com

ఏపీలో పెరుగుతున్న కేసులు.. గర్వపడుతున్న మంత్రి

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. కరోనాను ఎదుర్కోవడానికి ప్రజలంతా సిద్ధం కావాలని, ఎలాంటి భయాలకు గురి కాకూడదని ముఖ్యమంత్రి జగన్ ముందు నుంచి చెబుతున్నారని అన్నారు.

ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు జూమ్ ద్వారా మాట్లాడుతూ అనవసరంగా విమర్శలు గుప్పిస్తున్నారని బుగ్గన మండిపడ్డారు. కుమారుడు నారా లోకేశ్ తో ట్వీట్లు చేయిస్తున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నాయని అంటున్నారని… అక్కడ టెస్టింగ్ ఏ మేరకు జరుగుతోందని ప్రశ్నించారు. ఏపీలో టెస్టింగ్ ఎక్కువగా జరుగుతోందని, అందుకే కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ విషయాన్ని తాము గర్వంగా చెప్పగలమని అన్నారు.

Exit mobile version