Site icon TeluguMirchi.com

సూప్‌లో చనిపోయిన ఎలుక పాదం.. రూ.20 లక్షల దావా వేసిన కస్టమర్


అమెరికాలో ప్రముఖ ఇటాలియన్ రెస్టారెంట్ ఆలివ్ గార్డెన్ నుంచి తాను ఆర్డర్ చేసిన మైన్స్‌ట్రోన్ సూప్‌లో చనిపోయిన ఎలుక పాదం కనిపించిందని థామస్ హోవీ అనే వ్యక్తి పేర్కొన్నాడు. ఆ వ్యక్తి ఆలివ్‌ గార్డెన్‌ రెస్టారెంట్‌పై 25 వేల డాలర్ల(రూ.20.6 లక్షలు) దావా వేశాడు. 54 ఏళ్ల థామస్ హోవీ తన స్నేహితులతో కలిసి తనకు ఇష్టమైన ఆలివ్‌ రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు వెళ్లాడు.

తాను ఆర్డర్‌ చేసిన సూప్‌ను టేస్ట్‌ చేస్తుండగా.. తన నోటీలో ఏదో గుచ్చుకున్నట్లు అనిపించిందని.. మొదటి దానిని సూది అనుకున్నానని థామస్ హోవీ చెప్పాడు. తన నోటోలో ఉందని గ్రహించి ఉమ్మివేశానని, దానిని ఎలుక కాలుగా గుర్తించినట్లు చెప్పాడు. ఆపై రెస్టారెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. థామస్‌ హోవీ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సంఘటనను నివేదించాడు. పోలీసులు వచ్చిన తర్వాత గిన్నెలో ఉమ్మి వేసిన తెగిపోయిన జంతువు పాదాన్ని చూపించాడు. ఈ సంఘటన తర్వాత వ్యక్తి తీవ్ర ఆందోళన, నిరాశకు గురయ్యానని థామస్‌ హోవీ రెస్టారెంట్‌పై దావా వేశాడు.

Exit mobile version