మర్కజ్ ఈ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట పడ్డట్లే అనుకునే టైములో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన మర్కజ్ మత ప్రార్థనలకు విదేశీయులు రావడం..వారి ద్వారా ఆ ప్రార్థనలకు హాజరైన వారికీ కరోనా సోకడంతో దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎక్కువ అయ్యింది. ఈ ప్రార్థనలు వెళ్లిన వారందరికీ దాదాపు కరోనా సోకినట్లు బయట పడుతున్న కేసులు చూస్తే అర్ధమవుతుంది.
ఇక మర్కజ్ మత ప్రార్థనలకు హాజరైన ఓ విదేశీయుడు కరోనా వైరస్ సోకి మృతి చెందారు. దక్షిణాఫ్రికాకు చెందిన మౌలానా యూసఫ్ టుట్లా (80) ఇటీవల ఢిల్లీలో జరిగిన మర్కజ్‌కు హాజరయ్యారు. ప్రార్థనల అనంతరం తిరిగి స్వదేశానికి తిరిగి వెళ్లిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈమేరకు అతని కుటుంబ సభ్యులు ధృవీకరించారు.