సంక్రాంతి పండగ వేళా మాంజ దారం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. సంక్రాంతి వచ్చిందంటే చాలు చాలామంది కైట్స్ ఎగరేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే ఈ సరదా పలు పక్షాల ప్రాణాలతో పాటు మనుషుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది. ఎక్కువగా చైనా మాన్జా ను గాలిపటాలు ఎగరవేయడం కోసం వాడుతున్నారు. ఈ దారం వల్లే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా నిన్న మంచిర్యాల జిల్లాలో మాంజ దారం వల్ల ఓ వ్యక్తి ప్రాణం పోయింది. మంచిర్యాల నుండి ఓ వ్యక్తి తన భార్య తో కలిసి లక్షటిపేట వైపు వెళ్తుండగా గాలి పటం దారం మెడకు తగిలింది. ఒక్కసారి గా మెడకు తగిలిన దారం ఏకంగా ఆ వ్యక్తి గొంతును కోసింది. దాంతో కిందపడిపోయిన వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.