మమ్మీ… శరణం గఛ్చామి

sonia-gandhiకెసిఆర్ ఎంత కిందా మీదా పడుతున్నా తెలంగాణ కాంగ్రెస్ నేతలు వలలో చిక్కడం లేదు. ఆ మధ్య కేశవరావు పార్టీ వదిలేసి, కారు ఎక్కినంత హడావుడి జరిగింది. మళ్లీ మామూలే. పాపం, భేషజాలు వదిలి మరీ కేసీఆర్ గుమ్మం ముందు వెల్ కమ్ బోర్డు పట్టుకుని నిల్చున్నారు. అయినా వచ్చేవారు లేకపోయారు. దీనంతటికీ రెండే కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి కెసిఆర్ వ్యవహారాలు ప్రజలకు ఇంకా పూర్తిగా అవగతం కాలేదు కానీ, నాయకులకు బాగా తెలిసిపోయాయి. ఆయన్ను నమ్మి పార్టీ వీడితే అంతే సంగతులన్న అనుమానం కాంగ్రెస్ నేతల్లో బాగానే పాతుకుపోయింది.

ఇక రెండో ముచ్చట కూడా ఉంది. రాను రాను కెసిఆర్ వీకవుతున్నారన్నది. ఆ పార్టీ కూడా మిగితా పార్టీలకు పెద్దగా భిన్నమైనది కాదని, వసూళ్లు, చెక్కులు, కోట్లు, కుట్రలు, కుతంత్రాలు వంటి ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. వీటి ప్రభావం ఇప్పుడే కాకున్నా, కొన్నాళ్లయినా పార్టీపై ఇంతో కొంతో వుండనే వుంటుంది. అందుకే కెకె లాంటి తెలివైన నాయకులు, రాజకీయ భవిష్యత్ కోసం మళ్లీ సోనియా పాదాల చెంతనే వాలుతున్నారు.. ‘మమ్మీ’ (ఇటలీ అమ్మ కదా) శరణం గచ్ఛామి అంటున్నారు. వరుసపెట్టి తెలంగాణా నేతలనే దువ్వుతున్నారు. మొన్నటికి మొన్న ధర్మపురి శ్రీనివాస్ ఢిల్లీ వెళ్లివచ్చారు. ఇప్పుడు దానం నాగేందర్ కు పిలుపు వచ్చింది. రాజకీయాలు తప్పదు మరి. సరియైన వేదికను వదిలేందుకు అంత సులువుగా మనసు రాదు మరి.