Site icon TeluguMirchi.com

టిఆర్ఎస్ నేతల గుండెల్లో దడ పుట్టించిన ఇంద్రవెళ్లి సభ?

టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం ఇంద్రవెల్లి లో మొదటిసారి భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సభ గురుంచి తెరాస నేతలు విమర్శలు చేస్తుండడంతో తెలంగాణ పార్టీ సీనియర్ నాయకుడు మల్లు రవి తెరాస పై మాటల యుద్ధం చేసాడు.

ఇంద్రవెళ్లి సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో టిఆర్ఎస్ నేతల గుండెల్లో దడ పుట్టింది. దళిత గిరిజన దండోరా తో కలుగులో పండుకున్న నాయకులంతా బయటకు వచ్చి అరుస్తున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన బాష కొత్తగా వచ్చింది గత కొన్నేళ్లుగా కేసీఆర్ మాట్లాడిన బాషనే, ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులకు బాష గురించి తెలిసిందా… మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే లు రేవంత్ రెడ్డి పైన మాటల దాడి చేస్తున్నారు. వారు మంత్రులుగా ఉండి కాళ్ళు విరగ్గొడతాం, నాలుక కోస్తాం అనడం ఏమిటి..

ప్రజాస్వామ్యంలో మూల సూత్రం తప్పులు జరిగితే క్షమాపణ కోరడం.. అది మేము ఎప్పుడో చేసాము.. మంత్రులు రేవంత్ రెడ్డి పైన చేసిన మాటలపై క్షమాపణ చెప్పాలి. దళితులకు,గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్ని చేసి పెట్టాయి.. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు అమలు చేసి వాళ్ళను అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయిన ఘనత మాది.

రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దళిత, గిరిజనులను మోసం చేసింది. దళితులకు సీఎం ఇస్తామని ఇవ్వలేదు. మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇవ్వలేదు ఇవన్నీ ఇవ్వకుండా దళిత, గిరిజనులను మోసం చేయలేదా..

ఎస్టీ లకు జనాభా ప్రతిపతిపదిక న 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు ఇవ్వాలి. మరి ఇవ్వన్నీ ఇవ్వకుండా దళిత బంధు ఇస్తామని అంటున్నారు. ఇవన్నీ ఇవ్వకుండా కేసీఆర్ దళిత బంధు అవుతాడా.. దళితుల మోసం చేసిన వాడు అవుతాడా..
అవన్నీ ఇచ్చి దళిత బందు గా నిరూపించుకోవాలి.

రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలపై చర్చలకు రండి.. బీజేపీ తో రహస్య ఒప్పందం చేసుకొని టిఆర్ఎస్ రాజకీయాలు చేస్తుంది.. రాష్ట్రపతి ఎన్నికల నాటి నుంచి మొన్నటి పార్లమెంట్ బిల్లులతో సహా అన్నింటిలో బీజేపీ టిఆర్ఎస్ కలిసి పని చేసాయి..

దళిత, గిరిజనుల కోసం కాంగ్రెస్ పోరాటం ఆగదు.. 65 వేళా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని చెప్పి ఎందుకు ఖర్చు చేయలేదు. ఇవన్నీ చేయని కేసీఆర్.. దళిత బంధు వా. దళిత శత్రువా అని రేవంత్ రెడ్డి అడగడం తప్పా..

సభ కు లక్షా 20 వేల మంది వచ్చారు..ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు. మంత్రులు ఇలా మాట్లాడం విచిత్రంగా ఉంది… ఇంద్రవెళ్లి సభ కురుక్షేత్ర పోరాటంలో మొదటి రోజు లాంటిది.. ఇంకా యుద్ధం మిగిలే ఉంది..

కేసీఆర్ సీఎం పదవి కాలి గోటికి సరికాదు అన్నారు.. మంత్రులు రేవంత్ రెడ్డి ని కేసీఆర్ గోటికి సరిపొడు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం…మంత్రులు క్షమాపణ చెప్పాలి..

రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చారని అంటున్నారు..మరి టిఆర్ఎస్ లో ఉన్న కేసీఆర్, పోచారం, గుత్తా, ఎర్రవెల్లి, తలసాని, అంత ఎక్కడ నుంచి వచ్చారు.. అని ప్రశ్నించారు.

Exit mobile version