తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతుందనే సంగతి తెలిసిందే. ముఖ్యముగా హైదరాబాద్ మహానగరంలో కరోనా వైరస్ ఎక్కువగా ఉంది. కేవలం GHMC పరిధిలోనే రోజు రోజుకు వందల కేసులు దాటిపోతున్నాయి. దీంతి నగర ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.
తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. నిన్న రాత్రి ఆయన ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఆయకు జలుబు, ఆస్తమా ఉండటంతో మూడు రోజుల క్రితం కరోనా టెస్టులు చేయించుకున్నారు. దీంతో రిపోర్టులో పాజిటివ్ రావడంతో వెంటనే ఆస్పత్రిలో చేరారు. హోంమంత్రికి కరోనా రావడంతో ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కొందరు సెల్ఫ్ క్వారన్‌టైన్‌లోకి వెళ్లారు. దీంతో కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.