దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. దేశంలో నమోదవుతున్నరోజువారీ కరోనా కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్రలోని నమోదవుతున్నాయి . ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు లొక్డౌన్ విధిస్తారు అనుకున్నారు అందరు, కానీ దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే క్లారిటీ ఇచ్చారు. మహారాష్ట్రలో సంపూర్ణ లాక్ డౌన్ ఉండదు, కానీ రేపు రాత్రి ఎనిమిది గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహా జనతా కర్ఫ్యూ అమలుకానుంది. 15 రోజుల పాటు మహారాష్ట్రలో 144 సెక్షన్ అమలుకానుంది. రేపటి నుండి అన్ని ప్రభత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడనున్నాయి. అత్యవసర సేవలకు మెడికల్ షాప్స్, పెట్రోల్ బంక్ లు తెరిచే ఉండనున్నాయి. రెస్టారెంట్లలో పార్సెల్ లకు మాత్రమే అనుమతి ఉంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.