మహారాష్ట్ర లో కొత్తగా 67,123 కరోనా కేసులు, 419 మరణాలు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్రలోనే వస్తున్నాయి. ప్రస్తుతం లొక్డౌన్ తరహా కర్ఫ్యూ అమలవుతున్న కూడా నమోదవుతున్న కేసులు తగ్గట్లేదు. మహారాష్ట్ర లో గడిచిన 24 గంటల్లో 67,123 కేసులు నిర్ధారణ కాగా తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 37,70,707 మంది వైరస్‌ బారిన పడగా మొత్తం 6,47,933 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 56,783 మంది కరోనా నుండి కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 30,61,174 కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ తో 419 మంది మరణించారు, దీంతో రాష్ట్రంలో కొవిడ్ వల్ల 59,970 మంది మరణించారు.