ఈ నెల 27, 28 తేదిలలో హైదరాబాద్ లో జరుగనున్న మహానాడు నిర్వహణ కు సంబంధించి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. గత మూడు రోజులుగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో ఈ విషయమై సమావేశాలు జరుపుతున్నారు. మహానాడు నిర్వహణ కోసం 16 కమిటీలను చంద్రబాబు నియమించారు. రెండురోజులపాటు ఈ మహానాడు గండిపేట లో జరుగ నున్నాయి. ప్రతిష్టాత్మక పాదయాత్ర తరువాత జరుగుతున్న మహానాడు కాబట్టి ఈ మహానాడు ప్రత్యేకంగా జరపాలని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని కమిటిలతో బాబు స్వయంగా చర్చలు జరుపుతున్నారు. ఆ రెండు రోజులు జంటనగరాలను పసుపుమయం చేస్తామని దేశం నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు.