చిక్కుల్లో మాగంటి తనయుడు !

maganti-babu-sonమాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు ఈవ్ చీటింగ్ కేసులో బుక్కయ్యాడు. ఓ అమ్మాయికి అసభ్య ఎస్.ఎమ్.ఎస్ లు పంపించారని బాబు కుమారుడు రామ్ జీపై హైదరాబాద్ క్రైమ్ పీస్ లో కేసు నమోదైంది. యువతి ఈవ్ చీటింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రామ్ జీని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఏలూరు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, బాబు కుమారుడు ఇక్కడలేరని బాబు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం రాజ్ జీ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, రాజ్ జీ కి చిత్ర సీమతో పరిచయం ఉంది. ‘తూనీగా తూనీగ’ చిత్రాన్ని కూడా నిర్మించారు. ఫిర్యాదు చేసిన మహిళ రాంజీకి దూరపు బంధువు, వరుసకి అతనికి వదిన అవుతుందని సమాచారం. రాంజీపై ౫౦౬, ౫౦౯ ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.