కిరణ్ కు ఆ అధికారం లేదు !

madhu yaashkiముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా మంత్రుల శాఖలను మార్చే అధికారం ఉండవచ్చు… కానీ తెలంగాణ బిల్లును మర్చే అధికారం మాత్రం ఆయనకు లేదని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది.. వెనువెంటనే రాష్ట్రం ఏర్పాటవుతుందని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయని అన్నారు.