ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. వంద కాదు రెండొందలు కాదు ఇప్పుడు ఏకంగా రాష్ట్రంలో వెయ్యి కరోనా పాజిటివ్ కేసులు దాటడం తో అధికారులకు , ప్రజలకు ఇంకాస్త భయం పట్టుకుంది. మొన్నటి వరకు తగ్గుతాయిలే అని కాస్త ఊపిరి పీల్చుకోగా..ఇప్పుడు ఏకంగా వెయ్యి క్రాస్ కావడం తో రాష్ట్ర ప్రజలంతా ఆందోళన పడ్డారు. ఇదే అనుకుంటే ఇప్పుడు ఓ లారీ డ్రైవర్ కారణంగా 20 మందికి కరోనా పాజిటివ్ రావడం తో అధికారులకు చెమటలు పట్టిస్తుంది.
కృష్ణలంకకు చెదిన ఓ లారీ డ్రైవర్ రీసెంట్ గా కోల్‌కతా వెళ్లివచ్చిన సదరు డ్రైవర్ ద్వారా నిన్నటి వరకు 8 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆ సంఖ్య 20 వరకు చేరినట్టు అధికారులు చెబుతున్నారు.. ఇవాళ వచ్చిన 25 పాజిటివ్ కేసుల్లో ఆ ప్రాంతానివే 18 కేసులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.. దీంతో కృష్ణలంకలో హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు.. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. ముందస్తు చర్యలు దిగుతున్నారు.