లోక్ సభ రేపటికి వాయిదా!

parliament-budget-sessionపార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఆందోళనలతో అట్టుడుకింది. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న అయిదు సంవత్సారాల చిన్నారి అత్యాచార ఘటన, 2జీ, కోల్ స్కాంలు, మమతా బెనర్జీ దాడి అంశాలపై లోక్ సభ దద్దరిల్లింది. వీటిపై చర్చించాల్సిందిగా.. విపక్షాలు డిమాండ్ చేయగా.. ప్రధాన ప్రతిపక్షమైన భాజపా ఏకంగా స్వీకర్ కు నోటీసు ఇచ్చింది. ప్రతిపక్షాల ఆందోళనలతో సభ రెండు సార్లు వాయిదాపడింది. అనంతరం సభ మళ్లీ సమావేశమైనప్పటికినీ.. సభ్యుల తీవ్ర ఆందోళనల మధ్య స్వీకర్ మీరాకుమార్ లోక్ సభను రేపటికి వాయిదావేశారు. కాగా, అటు రాజ్యసభలోనూ.. చిన్నారి అత్యాచార ఘటన.. తదితర అంశాలపై తీవ్ర ఆందోళన మధ్య కొనసాగుతోంది.

మరోమైపు.. పార్లమెంట్ రెండో విడత సమావేశాలు ప్రారంభంకాగానే కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు ప్లే కార్డులతో నిరసన తెలియజేశారు. తెలంగాణ నినాదాలతో సభలో ఆందోళనకు దిగారు. తెలంగాణ విషయంలో.. కాంగ్రెస్ అధిష్టానం ధ్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.