లోక్‌సభలో విపక్షాల ఆందోళనల నడుమ ఈ రోజు మూడు బిల్లులకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. రాజ్యాంగ సవరణ (ఎస్టీ) బిల్లు, ది డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (సవరణ) బిల్లు, ది లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్ (సవరణ) బిల్లు ఆమోదం పొందాయి. పెగాసస్‌పై విపక్షాల ఆందోళనతో రాజ్యసభ మధ్యాహ‍్నం 2 గంటల వరకు వాయిదా పడింది. లోక్‌సభలో ఓబీసీ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఓబీసీ బిల్లుకు 15 విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. హడావుడిగా ఓబీసీ బిల్లు ప్రవేశపెట్టడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.