Site icon TeluguMirchi.com

రాహుల్ ఖాతాలో ’లోక్ పాల్’ క్రెడిట్.. !!

rahul-gandhiకాంగ్రెస్ లో నేతలు యువరాజు (రాహుల్ గాంధీ) జపం చేయడం మానడం లేదు.క్రిడిట్ వస్తే రాహుల్ ఖాతాలో.. పరువుపోతే పార్టీ ఖాతాలో వేయడం వారికి అలవాటుగా మారింది. తాజాగా, “లోక్ పాల్, లోకాయుక్తా బిల్లు-2011” నిన్నరాజ్యసభ ఆమోదం పొందగానే కాంగ్రెస్ నేతలు రాహుల్ భజనను ప్రారంభించారు.

రాహుల్ గాంధీ వల్లే లోక్ పాల్ సాధ్యమైందని నొక్కివక్కానించారు. అయితే, ఈ సారి కొంచెం డిఫరెంట్ గా భజన ప్రజెంటేషన్ ఇచ్చారు. అందుకు.. రాహుల్ గతకొద్దికాలంగా.. లోక్ పాల్ విషయంలో అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే తో జరిపిన ఉత్తర-ప్రత్యుత్తరాలను విడుదల చేశారు. ఇందులో..రాహుల్-అన్నాహజారే ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడం విశేషం.

‘అవినీతి వ్యతిరేక లోక్‌పాల్ బిల్లు విషయంలో మీ చిత్తశుద్ధిని అభినందిస్తున్నానంటూ హజారే… ‘బిల్లు విషయంలో మీ పాత్ర గౌరవనీయం. ఆ విషయంలో మీరిచ్చిన మద్దతుకు కృతజ్ఞులం’ అంటూ రాహుల్ ఒకరిపై ఒకరు లేఖల ద్వారా పొగడ్తల వర్షం కురిపించారు. లోక్‌పాల్ బిల్లును రాజ్యసభ ఆమోదించిన మంగళవారం రోజే ఆ లేఖలను కాంగ్రెస్ విడుదల చేసింది.  హజారే తన లేఖ ప్రతినిప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కూడా పంపించారు.

కాంగ్రెస్ నేతల భజనలతో భవిష్యత్ లో రాహుల్ గాంధీ ఖాతాలో క్రెడిట్ మాత్రమే వుంటుందేమో.. ! ఎందుకంటే.. పరువుపోతే.. పార్టీ ఖాతాలో కదా పడేది. మరీ.. వచ్చే సాధారణ ఎన్నికల్లో పరువుపోతే.. వేయడానికి ఎవరి ఖాతా వుండదంటున్నారు
రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి రాహుల్.. రాహుల్.. అంటూ.. రాజ్యసభలో లోక్ పాల్ ను గట్టెక్కించారు. ఇక మిగిలింది లోక్ సభనే..

Exit mobile version