Site icon TeluguMirchi.com

లోకేష్ సెటైర్ : ‘జగనన్న బీరు పండుగ’


మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చంటూ కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఏపీలోనూ మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే, నిబంధనలు పాటించని రీతిలో కొన్నిచోట్ల ప్రజలు క్యూలైన్లలో ఒకరినొకరు తోసుకుంటూ నిలుచోవడం దర్శనమిచ్చింది.

ఈ వ్యవహారంపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ‘జగనన్న బీరు పండుగ’ ఘనంగా ప్రారంభమైందని ఎద్దేవా చేశారు. మద్య నిషేధం మాటున చీకటి దందా సాగుతోందని ఆరోపించారు. మద్య నిషేధం అంటే రేట్లు పెంచడం, వైన్ కేసుల్లో కమీషన్లు తీసుకుని ప్రమాదకరమైన లిక్కర్ విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడమని వైఎస్ జగన్ సరికొత్త అర్థం చెప్పారని లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు లోకేష్.

Exit mobile version