క్ డౌన్ కారణంగా సామాన్య ప్రజలే కాదు సినీ , రాజకీయ , బిజినెస్ ఇలా ప్రతి రంగానికి చెందిన వారు ఇంటికే పరిమితమయ్యారు. ఏ పని లేకపోవడం తో కొంతమంది వంట వార్పు చేస్తే..మరికొంతమంది స్లిమ్ అయ్యేందుకు కసరత్తులు చేయడం చేసారు. నారా లోకేష్ కూడా అలాగే చేసినట్లు ఉంది. అందుకే గతంలో కంటే చాల స్లిమ్‌గా మరి అందరికి షాక్ ఇచ్చాడు.
కరోనా ఎఫెక్ట్, లాక్‌డౌన్ ఆంక్షలతో దేశంలోనే తొలిసారిగా వేలాదిమంది ప్రతినిధులతో డిజిటల్ పార్టీ సమావేశాలు నిర్వహిస్తోంది టీడీపీ.. వెబినార్ ద్వారా నిర్వహిస్తోన్న మహానాడుకు కేంద్ర కార్యాలయానికి హాజరైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని చూసిన ప్రతీ ఒక్కరూ “నారా లోకేశ్ 2.o అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. సన్నగా, స్లిమ్‌గా ఎలా మారారంటూ మీడియా వాల్లు కూడా లోకేశ్‌ని అడిగారు. ఇక, దీనిపై స్పందించిన ఆయన.. లాక్‌డౌన్ వల్ల హైదరాబాద్‌లో ఇరుక్కుపోవడంతో డైట్ కంట్రోల్‌తో పాటు వర్కవుట్స్ వల్లే సాధ్యమైందని వివరించారు. ఏకంగా 20 కేజీలు బరువు తగ్గగలిగానని చెప్పుకొచ్చారు.