కరోనాపై పోరుకు కేంద్రం చేస్తున్న సాయం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు నారా లోకేశ్ . ‘మా ఇంటికొస్తే ఏం తెస్తారు.. మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు’ అనేలా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. గత ఏడాది కంటే రూ.30 వేల కోట్లు అధిక ఆదాయం ఉన్నప్పటికీ ఉద్యోగులకు ఇచ్చే జీతాల నుంచి ప్రజలకు, వైద్యులకు అందించే మాస్కుల వరకూ కోతలు పెడుతున్నారని దుయ్యబట్టారు.
ఇదీలావుంటే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ హైపో క్లోరైడ్ పిచికారీ చేసేందుకు పంచాయతీ రాజ్ శాఖ చర్యలు చేపట్టింది. ముందస్తు జాగ్రత్తగా అన్ని ప్రాంతాల్లోనూ హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయాల్సిందిగా అదేశాలు జారీ చేసింది. నాలుగు రోజుల్లో 20 వేల చోట్ల ఈ ద్రావణం చల్లాల్సిందిగా క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలిచ్చింది.