Site icon TeluguMirchi.com

తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు..

ఇప్పటికే కరోనా తో తెలుగు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా..ఇప్పుడు మరో ముప్పు రానుందట. ఆఫ్రికా ఖండం నుంచి బయలుదేరిన మిడతల దండు దేశాలు, సముద్రాలు దాటుకొని పాకిస్తాన్ మీద దాడి చేసాయి. అక్కడ లక్షలాది ఎకరాలపై మిడతలు దాడులు చేసి పంటను నాశనం చేసాయి. అక్కడి నుంచి ఈ ముడతలు గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్య ప్రదేశ్ లోని పంటలపై దాడులు చేశాయి. ఈ పంటలపై చేసిన దాడుల వలన వందలాది ఎకరాల పంటలు నాశనం అయ్యాయి. మధ్యప్రదేశ్ లోని పంటలపై మిడతలు దాడులు చేస్తున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలని మిడతల నుంచి తరిమికొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అయితే, ఈ మిడతల దండు ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి తెలుగు రాష్ట్రాల వైపు వచ్చే వచ్చే అవకాశం ఉన్నది. జులై నెలలో ఈ మిడతల దండు తెలుగు రాష్ట్రాలవైపు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మిడతల దండు తెలుగు రాష్ట్రాలపై దాడులు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. మిడతల దండు ఎటాక్ చేస్తే దాని నుంచి పంటలను రక్షించుకోవడానికి ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version