Site icon TeluguMirchi.com

హైదరాబాద్ లో గురువారం ఎన్ని వాహనాలు సీజ్ చేసారో తెలుసా..?

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా పోలీసులు లాక్ డౌన్ ను ఎంత పటిష్టంగా నిర్వహిస్తున్నప్పటికీ బయటనుండి వచ్చే వారి కారణంగా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం రోడ్ల పైకి జనాలు రాకుండా చూడాలని..వాహనాలతో ఆలా వస్తే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనవసరంగా రోడ్ల పైకి వచ్చిన జనాలకు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడి వాహనాలను అక్కడ సీజ్ చేస్తున్నారు.

గురువారం ఒక్క రోజే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 వేల వాహనాలు సీజ్ చేశామని సజ్జనార్‌ తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని చెక్‌పోస్టులను అత్యవసరంగా తనిఖీ చేసి.. మరింత పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సజ్జనార్ స్వయంగా వాహనాలను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను భారీగా సీజ్ చేశారు. సెక్టార్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, దయచేసి ఎవరూ రోడ్లపైకి రావొద్దని విజ్ఞప్తి చేశారు. వాహనాల పాసులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Exit mobile version