కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల ఇప్పటికే జనజీవనం స్తంభించిపోయింది. పరిశ్రమలు మూతపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం దారుణంగా పడిపోయింది. ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద దెబ్బే. అయితే లాక్ డౌన్ ని పొడిగించాలని కేంద్రం దాదాపు ఖారరైపోయింది.
అయితే దేశవ్యాప్త లాక్‌డౌన్ ఈ సారి ఉండకపోవచ్చన్నది అంచనా. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించి.. మిగిలిన జిల్లాల్లో పరిమిత ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్ విధిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ ఉన్న జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించారు. ఆయా జిల్లాలు ఉండే జోన్ బట్టి ఆంక్షలు ఉండనున్నాయని తెలుస్తోంది.