తెలంగాణలో ఈ నెల 30 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 30వ తేదీ వరకు లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తామని, ఈ 15 రోజులు పాటు ఎక్కడివారు అక్కడే ఉండాలన్నారు. ఆ తర్వాత దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని తెలిపారు. . లాక్‌డౌన్ సమయంలో వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలకు మినహాయింపు ఉంటుందని చెప్పారు.
ఇక కరోనా గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 503 కేసులు నమోదయ్యాయని, 14 మంది మరణించారని, 96 మంది ఇప్పటి వరకు డిశ్చార్జి అయ్యారని అన్నారు. ప్రస్తుతం 393 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 1600 మంది క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు.