దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. కరోనా నియంత్రణకై కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మే 12 నుండి ఈ నెల చివరివరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది అవసరంలేకున్నా రోడ్ల మీదకొచ్చి లాక్ డౌన్ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. లాక్ డౌన్ టైం లో పాస్ లు లేకుండా రోడ్లమీదకొచ్చిన్న వారికి ఫైన్లు వేస్తున్నారు పోలీసులు .
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మే12 నుండి మే29 ఉదయం 10 గంటల వరకు మొత్తం 56466 కేసులు నమోదు చేసారు. వీటిలో లాక్ డౌన్ వయలేషన్ కేసులు (10 :00AM -6 :00PM ) – 41990 కేసులు , మాస్క్ సరిగ్గా పెట్టుకోకపోవడం/ అసలు పెట్టుకోకపోవడం – 11638 కేసులు, సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం – 1823 కేసులు, ఎక్కువమంది గుమికూడడం – 601 కేసులు, పబ్లిక్ ప్లేస్ లలో మత్తు సేవించడం 414 కేసులు గా నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 13490 వెహికల్స్ సీజ్ చేసారు.