కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. శని, ఆదివారాల్లో (ఈ నెల 24,25 తేదీల్లో) పూర్తి లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో టెస్ట్‌లను పెంచాలని ఆరోగ్యశాఖను ఆదేశించింది. శుక్రవారం రోజు అదనంగా 3లక్షల పరీక్షలు చేయాలని సూచించింది. పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువ ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించింది. అన్ని జిల్లాల్లోనూ మైక్రో కంటెయిన్‌మెంట్ జోన్లను గుర్తించాలని కలెక్టర్లను కోరింది.