Site icon TeluguMirchi.com

ఏపీలో వీటికి లాక్‌డౌన్ మినహాయింపులు..

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా అన్ని రాష్ట్రాలకు ఆర్ధికంగా నష్టం వాటిల్లుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి వస్తే లాక్‌డౌన్ వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం వస్తోందని జగన్ మొదటి నుండి చెపుతూ వస్తున్నాడు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్‌పై కొన్ని వెసులుబాట్లు కల్పించడంతో… ఏపీ ప్రభుత్వం కూడా వాటిని లెక్కలోకి తీసుకొని… కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలోని కొన్ని పరిశ్రమలకు మినహాయింపులను ప్రకటించింది.

అవి ఏంటి అంటే..

* అత్యవసర వస్తుత్పత్తి పరిశ్రమలకు పరిమిత మినహాయింపులు.

* కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిబంధనలకు అనుగుణంగా మినహాయింపు.

* లాక్ డౌన్ ఆంక్షలను పరిశ్రమల కోసం సడలిస్తూ ఆదేశాలు జారీ.

* ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు పనిచేసేందుకు అవకాశం.

* ఉత్తర్వులను కలెక్టర్లు, ఎస్పీలు, పరిశ్రమలశాఖ, రవాణా, కార్మిక శాఖ అధికారులకు పంపిన ప్రభుత్వం.- రైస్, పప్పు మిల్లులు, పిండిమరలు, డైరీ ఉత్పత్తుల పరిశ్రమలకు మినహాయింపు.

* ఆర్వో ప్లాంట్లు, ఆహారోత్పత్తి పరిశ్రమలు, మందుల తయారీ కంపెనీలకు మినహాయింపు.

* సబ్బులు తయారీ కంపెనీలు, మాస్కులు, బాడీ సూట్ల తయారీ సంస్థలకు మినహాయింపు.

* శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల తయారీ పరిశ్రమలకు మినహాయింపు.

* ఐస్ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలకు మినహాయింపు

* అమెజాన్, వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్ కార్యకలాపాలకు మినహాయింపు.

* ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతుల యూనిట్లకు మినహాయింపు

Exit mobile version