రేసులో లేనన్న అద్వానీ

lkభారత రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీ తర్వాత ఎవరు పదవి బాధ్యతలు చేపట్టనున్నారు అనే విషయంపై గత కొన్నాళ్లుగా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు ఎంతో మంది పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అమితాబచ్చన్‌ నుండి రామోజీ రావు వరకు, సుష్మా స్వరాజ్‌ నుండి అద్వానీ వరకు ఎంతో మంది పేర్లు పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఈ విషయంపై ఒక క్లారిటీ ఇవ్వలేదు.

మోడీ మనస్సులో అద్వానీ ఉన్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలను అద్వానీ కొట్టి పారేశారు. తాను రాష్ట్రపతి రేసులో లేను అంటూ తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో క్లీయర్‌గా చెప్పాడు. దాంతో రాష్ట్రపతి జాబితా నుండి ఎల్‌కే అద్వానీ వెళ్లి పోయినట్లే అయ్యింది. అయితే బీజేపీ సీనియర్స్‌ మరియు జూనియర్స్‌ అంతా కూడా అద్వానీ రాష్ట్రపతి అయితే ఆయనకు సముచిత న్యాయం, గౌరవం దక్కినట్లు అవుతుందని అంటున్నారు.

కాని ఆయనకు మాత్రం రాష్ట్రపతి పదవిపై ఆసక్తి ఉన్నట్లుగా అనిపించడం లేదు. మోడీ మనస్సులో ఎవరున్నారనేది మరో నె రోజుల్లో తేలిపోనుంది. ఎన్టీయే కూటమికి రాష్ట్రపతి ఎన్నికలకు పూర్తి బలం ఉంది. ఈ నేపథ్యంలో ఒత్తిడి లేకుండా రాష్ట్రపతిని ఎంపిక చేయాలని మోడీ భావిస్తున్నారు.