Site icon TeluguMirchi.com

ఇక సూపర్ మార్కెట్ లలోను మద్యం అమ్మకాలు

మద్యం కావాలంటే వైన్ షాప్ , బార్ లకే వెళ్లాల్సిన పనిలేదు..ఇకపై సూపర్ మార్కెట్ లలో , వాక్ ఇన్ స్టోర్ లలోనూ మద్యం అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు పక్కనున్న మహారాష్ట్ర లో..అవును మహారాష్ట్ర సర్కార్ సూపర్ మార్కెట్, వాక్ ఇన్ స్టోర్ లలో మద్యం అమ్మకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహారాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద రిజిస్టర్ చేసుకున్న 1000 చదరపు అడుగులు లేదంటే, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన సూపర్ మార్కెట్లు అలాగే దుకాణాలు సెల్ఫ్ ఇన్ షాప్ పద్ధతిని అవలంబించవచ్చు అని తెలిపింది.

అయితే ప్రార్థన మందిరాలు, విద్యా సంస్థలకు సమీపంలోని సూపర్ మార్కెట్ లోకి మాత్రం ఇందుకు అనుమతి లేదు. మద్యం నిషేధం అమల్లో ఉన్న జిల్లాల్లోనూ దీనికి అనుమతి లేదు. వైన్ అమ్మకాల కోసం లైసెన్స్ ఫీజు కింద సూపర్ మార్కెట్లు 5000 చెల్లించాల్సి ఉంటుంది. రైతులకు అదనపు ఆదాయాన్ని అందించే ఆధారిత వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Exit mobile version