Site icon TeluguMirchi.com

ఎల్‌ఐసీలో ఛైర్మన్‌ పదవి మార్చిన కేంద్రం

ఎల్‌ఐసీలో అత్యున్నత పదవి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఎల్‌ఐసీ ఛైర్మన్‌ పదవిని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మార్చింది. అంటే ఎల్‌ఐసీ ఛైర్మన్‌ను ఇకపై సీఈవో అని వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ ఎల్‌ఐసీ చట్టం 1956లోని కొన్ని సవరణలు చేసింది. ఈ మేరకు జులై 7న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇటీవలే ఎల్‌ఐసీ ఛైర్మన్‌గా ఉన్న ఎంఆర్‌ కుమార్‌ పదవీకాలాన్ని కూడా పొడిగించింది.

Exit mobile version