ఎల్‌ఐసీలో అత్యున్నత పదవి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఎల్‌ఐసీ ఛైర్మన్ పదవిని చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్‌గా మార్చింది. అంటే ఎల్‌ఐసీ ఛైర్మన్‌ను ఇకపై సీఈవో అని వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఎల్‌ఐసీ చట్టం 1956లోని కొన్ని సవరణలు చేసింది. ఈ మేరకు జులై 7న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవలే ఎల్‌ఐసీ ఛైర్మన్‌గా ఉన్న ఎంఆర్ కుమార్ పదవీకాలాన్ని కూడా పొడిగించింది.