Site icon TeluguMirchi.com

న్యూ ఇయర్‌ వద్దనుకుంటున్న నాయకులు

No new year 2013 to Chandra babu Sonia Kiran and YSRCPనూతన సంవత్సర వేడుకలు న్యూజిలాండ్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. బాణసంచా పేళుల్లతో  ఆక్లాండ్‌ దద్దరిల్లుతోంది. కివీస్‌ ప్రజలు 2013 సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు.

మరో వైపు పలువురు నాయకులు న్యూ ఇయర్‌ వేడుకలకు స్వస్తి చెప్పినట్టు తెలుస్తోంది…

* టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు న్యూఇయర్‌ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలంతా న్యూ ఇయర్‌ వేడుకలకు దూరంగా ఉండాలన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా న్యూఇయర్‌ వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.

* దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటనకు నిరసనగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిశ్చయించుకున్నారు. నూతన సంవత్సర వేడుకలకు జరుపుకోవద్దని పార్టీ నేతలు, కార్యకర్తలకు సోనియా విజ్ఞప్తి చేశారని పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ పూజారి వెల్లడించారు. గ్యాంగ్ రేప్ గురైన ‘ఆమె’ చికిత్స పొందుతూ సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

* రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి న్యూఇయర్‌ వేడుకలకు దూరంగా ఉంటున్నారు. ఢిల్లీ ఘటన నేపథ్యంలో వేడుకలు జరుపుకోవద్దని సీఎం కిరణ్‌ నిర్ణయించారు.

* న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని వైఎస్ఆర్ సీపీ నిర్ణయించుకుంది. పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అక్రమ నిర్బంధానికి నిరసనగా వేడుకలకు దూరం ఉండాలనుకున్నారు. కోటి సంతకాల ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పార్టీ నేతలు కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.

Exit mobile version