నందమూరి తారకరామారావు 97వ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు , చిత్ర సీమా ప్రముఖులు , తెలుగుదేశం పార్టీ నేతలు , కార్య కర్తలు జయంతి వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్ కు నివాళ్లు అర్పించిన వైసీపీ నేత, తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. దివంగత నటుడు, ఆంధ్రుల ఆరాధ్యుడు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయని తెలిపింది.
ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారని లక్ష్మీ పార్వతి తెలిపారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని అన్నారు. తెలుగు వారి కష్టాలను తీర్చటానికి ఇద్దరు ముఖ్యమంత్రులు అహర్నిశలు కష్టపడున్నారని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు.