Site icon TeluguMirchi.com

రైలు ప్రయాణికుల నుండి ల్యాప్ టాప్ లు చోరీ, చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే ప్రయాణికుల వద్ద నుండి ల్యాప్ టాప్ లు అపహరిస్తున్న వ్యక్తిని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 11ల్యాప్ టాప్ లు, ఒక ఐ పోన్, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే ఎస్పీ షేక్ సలీమ తెలిపారు.

రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైళ్లలో ప్రయాణిస్తున్న ఒంటరి ప్రయాణికులే లక్ష్యంగా కర్ణాటక కు చెందిన శ్రీశైల భోసాగి చోరీలకు పాల్పడుతున్నాడని ఎస్పీ పేర్కొన్నారు. సులభంగా డబ్బులు సంపాదించడం కోసం ల్యాప్ టాప్ లను చోరీ చేసి ఆన్ లైన్ లో ఇతర రాష్ట్రాలకుంచెందిన వ్యక్తులకు అమ్మడం ప్రవృత్తిగా మార్చుకున్నాడని వివరించారు. ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన శ్రీశైలం ను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ తతంగమంతా బయట పడిందని చెప్పారు. నిందితుడి నుండి 7లక్షల 50వేల విలువైన 11ల్యాప్ టాప్ లు, ఒక ఆపిల్ పోన్, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.

Exit mobile version