Site icon TeluguMirchi.com

భూమిని చదును చేస్తుండగా లంకె బిందె లభ్యం, తెరిచి చూస్తే షాక్ !

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో గురువారం బంగారం లంకె బిందె లభ్యమైంది. భూమిలో వెంచర్‌ ఏర్పాటు కోసం జేసీబీతో భూమిని చదును చేస్తుండగా లంకె బిందె కనిపించింది. బిందెను తెరిచి చూడగా అందులో 17తులాల బంగారం, 10కిలోల వెండి లభ్యమైంది. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు, తహసీల్దారు రవీందర్‌, గ్రామ సర్పంచి ఆంజనేయులు, పోలీసులు ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Exit mobile version