లగడపాటి వెనక్కు తీసుకున్నారు.. !

lagadapatiతన రాజీనామా ఆమోదంపై ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ ను విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెనక్కి తీసుకున్నారు. రాజీనామాలు ఆమోదించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలంటూ.. కొద్దిరోజుల కిందట లగడపాటి ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే, పిటిషన్ ను వెనక్కు తీసుకువాలని కేంద్రమంత్రి మంత్ర కమల్ నాథ్ చేసిన విజ్ఞప్తి మేరకే లగడపాటి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, లగడిపాటి పిటిషన్ ను వెనక్కు తీసుకోవడంతో.. రాజీనామా ఆమోదింపజేసుకోవడంలో ఆయనకు చిత్తశుద్ధిలేదని స్పష్టమైందని సమైక్య వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.